![]() |
![]() |
.webp)
పల్సర్ బైక్ రమణ అంటే చాలు సోషల్ మీడియాలో ఎన్నో కామన్ మ్యాన్ సాంగ్స్ క్యూ కడతాయి. "నేనట్టాంటి ఇట్టాన్టి ఆడదాన్ని కాను బావయో...పల్సర్ బైక్ మీద రాను బావయో" అనే పాటతో ఫుల్ ఫేమ్ సంపాదించాడు. ఈ సాంగ్ నే రవితేజ హీరోగా నటించిన "ధమాకా" మూవీలో పెట్టారు. ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. సింగర్ రమణ సింగర్ గా మాత్రమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తూ ఉంటాడు. ఆయనకు రైటర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఇంత పేరు సంపాదించుకున్న రమణ రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు.
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఈ కొత్త జంటను ఇన్వైట్ చేసి ఈ ఎపిసోడ్ కి "కొత్త జంట" అనే టైటిల్ కూడా పెట్టేసింది. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక రమణ వైఫ్ కుందనాశ్రీతో రష్మీ "మీ ప్రేమ చెప్పుకోవాలంటే ఎలా చెప్తావ్" అని అడిగింది. "తానొక ఆర్టిస్ట్ అని మా పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలేదు. మా వాళ్ళు అన్న మాటలకు అతని ప్లేస్ లో ఇంకా ఎవరైనా ఉండి ఉంటే డ్రాప్ ఐపోయేవాళ్లు. మా వాళ్ళు అన్న మాటల్నే కాదు నన్ను కూడా చాలా భరించారు అందుకు థ్యాంక్స్ అండ్ లవ్ యు" అంటూ చెప్పింది. ఇక రమణ వెళ్లి తన వైఫ్ నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రజ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం మొత్తం వాళ్ళను స్టేజి మీద కూర్చోబెట్టి చీరా సారె ఇచ్చారు. ఈ వారం కొత్త జంట కాన్సెప్ట్ తో ఎపిసోడ్ ఆడియన్స్ ని అలరించబోతోంది. రెండు షార్ట్ ఫిల్మ్స్ ను కూడా తీసాడు రమణ . "బేబీ" అనే షార్ట్ ఫిల్మ్ ను తన రియల్ స్టోరీ ఆధారంగానే తెరకెక్కించాడు.
![]() |
![]() |